AR Rahman | అధ్యక్ష ఎన్నికలతో (US Elections) అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయాలు వేడెక్కాయి. డెమోక్రాట్స్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఇద్దరు అభ్యర్థులూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక భారత మూలాలున్న అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు గట్టి పోటీ ఇస్తున్నారు.
ఈ ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా ‘ద ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐ లాండర్స్’ (AAPI) నిధులు సేకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాన్సర్ట్ (Concert) నిర్వహించనున్నారు. ఇందుకోసం రెహమాన్ తాజాగా ఓ వీడియోను కూడా రూపొందించారు. రెహమాన్ రూపొందించిన 30 నిమిషాల నిడివి గల వీడియోలో.. కమలా హారిస్‌కు మద్దతుగా ఉన్న నేతల వాయిస్‌ను పొందుపరిచారు. ఈ వీడియో విక్టరీ ఫండ్ అనే యూట్యూబ్‌లో రేపు రాత్రి అంటే అక్టోబర్ 13 రాత్రి 8 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ఈ విషయాన్ని ఏఏపీఐ విక్టరీ ఫండ్ చైర్పర్సన్ శేఖర్ నరసింహన్ తెలిపారు. కాగా, నవంబర్ 5న అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Also Read..
Rahul Gandhi | ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా పాఠాలు నేర్వరా..?.. రైలు ప్రమాద ఘటనపై రాహుల్ ఫైర్
Rishabh Pant | నేను వేలంలో అమ్ముడవుతానా..? : రిషభ్ పంత్ ఆసక్తికర ట్వీట్