Boeing | విమానయాన దిగ్గజ సంస్థ బోయింగ్ (Boeing) సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించింది (Layoffs). సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఈ మేరకు సంస్థ సీఈవో (Boeing CEO Kelly Ortberg) ఉద్యోగులకు ఈమెయిల్ పంపారు.
సియాటెల్ ప్రాంతంలో 33,000 మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె (strike) చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో 737 MAX, 767, 777 జెట్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఈ సమ్మె కారణంగా సంస్థ మూడో త్రైమాసికంలో 5 బిలియన్ డాలర్ల నష్టం చవిచూసింది. ఈ విషయాన్ని బోయింగ్ సంస్థ వెల్లడించింది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు చేపట్టింది. ఏకంగా 17 వేల మందిపై వేటు వేసింది.
Also Read..
AR Rahman | కమలా హారిస్‌కు మద్దతుగా కాన్సర్ట్.. 30 నిమిషాల వీడియోను రూపొందించిన ఏఆర్ రెహమాన్
Rishabh Pant | నేను వేలంలో అమ్ముడవుతానా..? : రిషభ్ పంత్ ఆసక్తికర ట్వీట్