Gandhi Bhavan | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని గాంధీ భవన్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గాంధీ భవన్ వేదికగా జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. యూత్ కాంగ్రెస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆ తర్వాత రెండు పక్షాలు బాహాబాహీకి దిగారు. పార్టీలో పదవుల కోసం ఇరు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు కట్టబెడుతున్నారని కొత్తగూడెం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇక రెండు వర్గాల వారు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గాంధీ భవన్లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన వారికి పోస్టులు ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన ఒరిజినల్ యూత్ కాంగ్రెస్ నేతలు
దీంతో ఇరు పక్షాల మధ్య ఘర్షణ
గాంధీ భవన్లోనే కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు pic.twitter.com/icyK6EEW6h
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025
ఇవి కూడా చదవండి..
KTR | బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
Karimnagar | గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్లు మొక్కిన మహిళ : వీడియో
Bhupal reddy | కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి