నల్లగొండ : నిన్న తనపై నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో దాడిచేసిన కాంగ్రెస్ నాయకులు, గుండాలపై చర్యలు తీసుకోవాలని నల్లగొండ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి(Bhupal reddy) జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే కాంగ్రెస్ నాయకులకు సహకరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకొని వారిని వెంటనే అరెస్ట్ యాలన్నారు. ఆయన వెంట రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్రు నాయక్, పల్లె రవికుమార్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తదితరులు ఉన్నారు.
కాగా, కంచర్ల భూపాల్‌రెడ్డి సహా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారు. మున్సిపల్ చాంబర్ బయట కూర్చున్న కంచర్లపై మంగళవారం ఒక్కసారిగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తూ దూసుకొచ్చిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, వారి అనుచరులు కుర్చీలు, పూలకుండీలు విసిరి దాడి చేశారు. నల్లగొండలో బీఆర్ఎస్ రైతు ధర్నా ఫ్లెక్సీని చించివేసి కాంగ్రెస్ నాయకులు ఘర్షణకు తెరలేపిన విషయం తెలిసిందే.