హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు(Village assembly) ఘర్షణలకు నిలయంగా మారాయి. పేరుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నా పెత్తనం అంతా కాంగ్రెస్ నాయకులదేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లంచాలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు అనర్హులకు కేటాయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆగ్రహం చెందిన ప్రజలు అధికారులు, ప్రజా ప్రతినిధులపై తిరగబడుతున్నారు.
తాజాగా కరీంనగర్ జిల్లా గన్నేరు వరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో ఓ మహిళ తనకు అన్యాయం జరిగిందని కంట తడి(Woman cries) పెట్టుకుంది. ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరులేదని, తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాళ్లు పట్టుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గ్రామ సభలో ఏడుస్తూ అధికారుల కాళ్ళు మొక్కిన మహిళ
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కంట తడి పెట్టిన మహిళ
ఆత్మీయ భరోసాలో ప్రజలకు అన్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇండ్లలో అర్హులైన తమ పేరులేదని తనకి న్యాయం చేయాలని ఏడుస్తూ అధికారులకు దండం పెడుతూ కాళ్లు… https://t.co/T8VGbKeB06 pic.twitter.com/4tCxsD8bG8
— Telugu Scribe (@TeluguScribe) January 22, 2025