నిజామాబాద్ : నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌లోని ఇంద్రాపూర్‌కు చెందిన రఘుపతి ఏడాదిన్నర కూతురు నేహ బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నది. కూతురు అనారోగ్యంతో మనస్థాపం చెందిన రఘుపతి నిజామాబాద్ శివారులోని న్యాల్క్ మాసాని చెరువులో కూతురితో కలిసి చెరువులో దూకాడు.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహకారంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్
RC16 | రాంచరణ్ ఆర్సీ16 షూట్ టైం.. మైసూర్ టెంపుల్ ముందు బుచ్చి బాబు సాన