Herbal Teas | ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గించే హెర్బల్ టీలు.. రోజూ తీసుకుంటే ఎంతో మేలు..
ఒత్తిడి, ఆందోళన నేటి జీవనశైలిలో సర్వసాధారణ సమస్యలుగా మారాయి. ఇలాంటి సమయంలో చాలామంది మందులపై ఆధారపడుతుంటారు. అయితే కొన్ని సహజ మూలికలతో తయారుచేసిన హెర్బల్ టీలు మనసుకు ప్రశాంతతను అందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు.
Herbal Teas | ఒత్తిడి, ఆందోళన నేటి జీవనశైలిలో సర్వసాధారణ సమస్యలుగా మారాయి. ఇలాంటి సమయంలో చాలామంది మందులపై ఆధారపడుతుంటారు. అయితే కొన్ని సహజ మూలికలతో తయారుచేసిన హెర్బల్ టీలు మనసుకు ప్రశాంతతను అందించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఒక కప్పు వేడి హెర్బల్ టీ శరీరంతోపాటు మనసుకు కూడా సేదతీరే అనుభూతిని కలిగిస్తుంది. గ్రీన్ టీ ఒత్తిడిని తగ్గించేందుకు ఎక్కువగా ఉపయోగించే హెర్బల్ పానీయాల్లో ఒకటి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడటమే కాకుండా, ఇందులో ఉండే పాలీఫినాల్స్ ఆందోళనను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. రోజ్ టీ కూడా నరాలను ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడే పానీయంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా రాత్రి నిద్రకు ముందు దీనిని తీసుకుంటే మంచి నిద్రకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఎండబెట్టిన గులాబీ రేకులను నీటిలో మరిగించి, అవి ముదురు రంగులోకి మారిన తర్వాత వడగట్టి తాగవచ్చు.
ప్యాషన్ ఫ్లవర్ టీ..
ప్యాషన్ ఫ్లవర్ టీ కూడా ఒత్తిడి తగ్గించేందుకు సహజమైన మార్గంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫ్లేవోన్ క్రైసిన్ అనే పదార్థం ఆందోళనను తగ్గించడంలో, ప్రశాంతమైన నిద్రకు తోడ్పడడంలో సహాయపడుతుంది. ఎండబెట్టిన ప్యాషన్ ఫ్లవర్‌ను నీటిలో మరిగించి వడగట్టి ఈ టీని తయారు చేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడేవారికి క్యామొమైల్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది తలనొప్పి, ఆందోళనను తగ్గించి శరీరాన్ని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఎండబెట్టిన క్యామొమైల్ పువ్వులను వేడి నీటిలో మరిగించి వడగట్టిన తర్వాత ఈ టీని తాగవచ్చు. లెమన్ బామ్ టీ కూడా సహజంగా ప్రశాంతతను కలిగించే గుణాలు కలిగిన పానీయంగా మారింది. ఒత్తిడికి సంబంధించి శరీరంలో విడుదలయ్యే కార్టిసోల్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో, మానసిక ఉల్లాసాన్ని పెంచడంలో ఇది ఉపయోగపడుతుంది. పుదీనా కుటుంబానికి చెందిన ఈ మూలికతో తయారయ్యే టీకి ఆహ్లాదకరమైన సువాసన, రుచి ఉంటాయి.
పెప్పర్మింట్ టీ..
పెప్పర్మింట్ టీ కూడా ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే మరో హెర్బల్ టీగా గుర్తింపు పొందింది. ఇందులో ఉండే మెంథాల్ సహజ కండరాల సడలింపుగా పనిచేసి శరీరానికి విశ్రాంతిని అందించడంలో తోడ్పడుతుంది. అంతేకాకుండా ఇందులో కెఫిన్ లేకపోవడం వల్ల ప్రశాంతమైన నిద్రకు కూడా దోహదపడుతుంది. అయితే తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన లేదా నిద్రలేమి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా వైద్యులను లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

