Ameer Log | ‘కాసుల కళ వేరే అంట.. అవి పూసుకు తిరగాలంటా’.. ఆలోచింపజేసేలా అమీర్ లోగ్ సాంగ్
Ameer Log | అమీర్ లోగ్ (Ameer Log) ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ కాసుల కళ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు.
Ameer Log | రమణారెడ్డి సోమ డైరెక్ట్ చేస్తున్న యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అమీర్ లోగ్ (Ameer Log). ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో వేదా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీ నుంచి విడుదల చేస్తున్న ఒక్కో పాట సెపరేట్ స్టైల్లో సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి.
తాజాగా మేకర్స్ కాసుల కళ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను లాంచ్ చేశారు. రెక్కలు కదలాడందే చిక్కులు విడిపోవంట లెక్కలు సరితూగే వేళ.. పిక్కలు పరుగాడందే డొక్కలు నిదరోవంట.. కాసుల కళ వేరే అంటా.. అవి పూసుకు తిరగాలంటా అనే లిరిక్స్‌తో హైదరాబాద్‌లో కాసులు సంపాదనలో పడే కష్టాలు ఎలా ఉంటాయో కండ్లకు కట్టినట్టు చూపించనున్నట్టు విజువల్స్‌తో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. ఈ సాంగ్‌కు హైదరాబాదీలంతా కనెక్ట్ అవడం గ్యారంటీ అని లిరిక్స్ చెప్పకనే చెబుతున్నాయి. కాసుల కళ.. ఒకపాట కాదు.. మన జీవితంలో చాలా మందికి కనెక్ట్ అయ్యే ఒక ఎమోషన్ అంటూ రిలీజ్ చేసిన ఈ పాటపై మీరూ ఓ లుక్కేయండి.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన అవ్వల్ దావత్ సాంగ్‌తోపాటు హైదరాబాదీ ర్యాప్ స్టైల్లో సాగే ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అమీర్ లోగ్ తెలుగు రాష్ట్రాల పంపిణీ హక్కులను టాలీవుడ్ యాక్టర్ రానాకు చెందిన స్పిరిట్ మీడియా సొంతం చేసుకుంది. హైదరాబాద్ గల్లీ బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు స్నేహితుల మధ్య కథ నేపథ్యంలో కామెడీతోపాటు కంటెంట్‌ను నమ్మి వస్తున్న మూవీని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు.
కాసుల కళ లిరికల్ వీడియో సాంగ్..
💰 Kaasula Kala… Oka paata kaadhu, mana jeevithamlo chala mandiki connect ayye oka emotion. ❤️🎶#KaasulaKala
Full lyrical video out now from #AmeerLoghttps://t.co/Hg6KnSEBHJIn Theatres Worldwide on August 21
Singer: @Eknaath333
Music: @smaransai
Lyrics: #Nikleshsunkoji… pic.twitter.com/zq1X1Jnffd— BA Raju’s Team (@baraju_SuperHit) August 2, 2026
Read Also :
KTR | పెద్ది సుదర్శన్ రెడ్డిపై ప్రభుత్వం ఒత్తిడి చేసిన మాట వాస్తవం : కేటీఆర్
Vinesh Phogat | వ్యవస్థ మొత్తం బ్రిజ్ భూషణ్‌నే కాపాడుతుంది: వినేశ్ ఫోగట్
Justice M.S. Liberhan: బాబ్రీ మసీదు ఎంక్వైరీ కమిషన్ హెడ్ జస్టిస్ ఎంఎస్ లిబర్హన్ కన్నుమూత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

