‘మణుగూరు మనుగడ కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం’
మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు.
– ఫలించిన ఉద్యమం
– రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిళ్లను తిప్పికొట్టిన ఏఐటీయూసీ
– సింగరేణికి దక్కిన పీకే–2 డీప్ సైడ్ బ్లాక్
రుద్రంపూర్, ఆగస్టు 03 : మణుగూరు పీకే ఓసి డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ వేలంపాటలో జెన్కో, సింగరేణి సంస్థలు పోటీ పడగా చివరకు 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో సింగరేణి దక్కించుకోవడం గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేపట్టిన నిరంతర పోరాటాలు, ఉద్యమాలు, కార్మికుల ఐక్యస్ఫూర్తికి దక్కిన ఘన విజయమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మణుగూరు పీకే-2 డీప్ సైడ్ బొగ్గు బ్లాకు విషయంలో జెన్కోను వేలంపాట ప్రక్రియ నుంచి తప్పించాలని ఉద్యమం చేసిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ అన్నారు. అదేవిధంగా సింగరేణి మాత్రమే వేలంపాటలో పాల్గొనేలా చేసి బ్లాకును సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేసింది, మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, రాస్తారోకోలు, గనుల వద్ద ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ, నిరసన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, అరెస్టులను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించామని గుర్తు చేశారు.
ఆ ఉద్యమాల ఫలితంగానే నేడు సింగరేణి వేలంలో పాల్గొని 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో మణుగూరు పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకుందని తెలిపారు. ఈ విజయానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు, ఏఐటీయూసీ చేపట్టిన ఉద్యమాలు కీలకంగా దోహద పడ్డాయన్నారు. పీకే–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణి మనుగడకు ప్రాణాధారమని, వేలాది మంది కార్మికుల ఉపాధి, మణుగూరు ప్రాంత అభివృద్ధి, సింగరేణి సంస్థ భవిష్యత్ ఈ బ్లాక్‌పైనే ఆధారపడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో మణుగూరు బ్లాక్‌ను జెన్కో పేరుతో వేలంలో ప్రవేశపెట్టి, చివరకు ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేందుకు జరిగిన ప్రయత్నాలను ఏఐటీయూసీ తీవ్రంగా ప్రతిఘటించిందన్నారు “జెన్కో కాదు.సింగరేణికే మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాక్ కేటాయించాలి” అనే నినాదంతో చేపట్టిన ఉద్యమం చివరకు విజయాన్ని సాధించిందని తెలిపారు.”సేవ్ సింగరేణి – సేవ్ మణుగూరు” నినాదంతో సాగిన ఈ ఉద్యమం కార్మికుల ఐక్యతకు, సంకల్పానికి ప్రతీకగా నిలిచిందన్నారు. జెన్కోపై పైచేయి సాధిస్తూ సింగరేణి 6.5 శాతం రెవెన్యూ షేర్‌తో పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను దక్కించుకోవడం ఏఐటీయూసీ ఉద్యమ చరిత్రలో మరో చిరస్మరణీయ విజయమని వాసిరెడ్డి సీతారామయ్య, కొరిమి రాజ్‌కుమార్ స్పష్టం చేశారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
‘సూర్యాపేట జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి’
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

