నెన్నెల, సెప్టెంబర్ 19 : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ(Loan waiver) చేసేలా చూడాలంటూ రాష్ట్ర గవర్నర్ జిస్టుదేవ్ వర్మకు(Governor Jistudev Verma) రైతులు(Farmers )రెండో రోజూ ఉత్తరాలు(Letters) రాశారు. గురువారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంతో పాటు మైలారం, ఆవుడం, పోస్టాఫీసుల్లో దాదాపు 100 మంది రైతులు గవర్నర్‌కు ఉత్తరాలు పోస్టు చేశారు. కొందరు రైతులు రిజిస్టర్ పోస్టు చేయగా, మరికొందరు సాధారణ లెటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
అన్ని అర్హతలున్నా న్యాయం చేయడం లేదని, ఓట్లప్పుడు ఒక రకంగా.. గెలిచినాక ఒకతీరుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోని షరతులు పెట్టి రైతులను ఆగం చేస్తున్నారని, ఇప్పటికైనా అందరికీ రుణమాఫీ చేసి ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
Dasara Holidays | దసరా సెలవులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఎప్పట్నుంచంటే..?
KTR | కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు.. తప్పుబట్టిన కేటీఆర్