Dasara Holidays | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 13 రోజుల అనంతరం అంటే అక్టోబర్ 15వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగను జరుపుకోనున్నారు.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు ఐదు రోజుల పాటు క్రిస్మస్ హాలీడేస్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి సెలవులు ఐదు రోజులు ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | కంగనా రనౌత్‌పై దానం నాగేందర్ అనుచిత వ్యాఖ్యలు.. తప్పుబట్టిన కేటీఆర్
TG EAPCET 2024 | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల