KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్యం అందక పసి పిల్లల నుంచి పెద్దల దాకా పిట్టల్లా రాలిపోతున్నారు. మెడిసిస్స్ కొరత కూడా ఉండడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నెలకొన్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తున్న సంగతి తెలిసిందే.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదు.. పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహాప్రభో అంటే బురద జల్లుతున్నారని మాట్లాడుతారా..? అని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటు ఆస్పత్రులకు కొమ్ముకాయాలనుకుంటే… హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుపత్రులు, వరంగల్‌లో నిర్మాణమవుతున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానాలు, గ్రామాల్లో క్లినిక్‌లు ఏర్పాటు చేసే వాళ్లమా? అని కాంగ్రెస్ సర్కార్‌ను కేటీఆర్ నిలదీశారు.
కేసీఆర్ కిట్లు, తల్లి-బిడ్డను ఇంటి దగ్గర వదిలిపెట్టే వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవటం, రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట 33 మెడికల్ కాలేజీల ఏర్పాట్లు జరిగేవా? అని ప్రశ్నించారు. మాపై ఎదురుదాడి తర్వాత, ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు… ఆ తల్లుల కడుపుకోత తీర్చలేము. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే.. మీ ఆలోచించే ధోరణితో పాటు మీ పాలన తీరు కూడా మారుతుందన్నారు కేటీఆర్. ఇప్పటికైనా మరణాలపై రివ్యూ చేశారా…? నాణ్యమైన వైద్యం అందించేందుకు ఫోకస్ చేశారా… లేదా? మొన్నటి బదిలీల్లో సీనియర్ డాక్టర్లను బదిలీపై పంపారన్న ఆరోపణల్లో వాస్తవం ఉందా… లేదా? ఇది చెప్పండి అని ప్రభుత్వాన్ని కేటీఆర్ అడిగారు.
వైద్యం అందటం లేదు… పసి పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహప్రభో అంటే బుదరజల్లుతున్నారు అని మాట్లాడతారా?
మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ముకాయాలనుకుంటే… హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్దాసుపత్రులు, వరంగల్ లో నడుస్తున్న అతిపెద్ద…
— KTR (@KTRBRS) September 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? రోడ్డుప్రమాదాలపై కేటీఆర్ ట్వీట్
TG EAPCET 2024 | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల