TG EAPCET 2024 | హైదరాబాద్ : టీజీ ఎప్సెట్ -2024(ఎంపీసీ స్ట్రీమ్) ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన విద్యార్థులు.. ఈ నెల 24 నుంచి 25వ తేదీ వరకు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. 25న ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. 27న ప్రొవిజినల్ అలాట్మెంట్ జరగనుంది.
సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీల్లో వెబ్సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 28, 29 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. తదితర వివరాల కోసం tgeapcetb.nic.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? రోడ్డుప్రమాదాలపై కేటీఆర్ ట్వీట్
KTR | సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు కేటీఆర్ ఆల్ ది బెస్ట్