KTR | హైదరాబాద్ : సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా రనౌత్‌కు రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. దానం చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు.
మహిళలను కించపరిచే విధంగా రాజకీయాలు ఉండకూడదు. బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ పట్ల దానం నాగేందర్ ఉపయోగించిన నీచమైన భాష ఆమోదయోగ్యం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. కంగనా రనౌత్ అభిప్రాయాలను, ఆమె పార్టీ ఐడియాలజీని తాను ఏకీభవించను.. కానీ ఇలా దిగజారుడు మాటలు మాట్లాడటం సరికాదు. ఢిల్లీలో, తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు కూడా దానం నాగేందర్ వ్యాఖ్యల పట్ల మౌనం వహించడం ఆశ్చర్యంగా ఉంది. దానం వ్యాఖ్యలను వారు ఆమోదిస్తున్నారా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. సోనియా గాంధీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు.. తెలంగాణలోని మీ సొంత పార్టీ సభ్యులు, రేవంత్ రెడ్డి స్పందించకముందే.. కేసీఆర్ స్పందించారు. సోనియా గాంధీని అవమానించేలా హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి కంటే ముందే కేసీఆర్ ఖండించిన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. రాజకీయాలను పక్కనపెడితే నీతి, మర్యాదకు కట్టుబడి ఉంటామన్నారు కేటీఆర్.
క్రూరమైన నేరం.. క్రూరమైన నేరమే. అది రేప్ కావొచ్చు. మర్డర్ కావొచ్చు.. మహిళలను కించపరిచేలా మాట్లాడడం కూడా నేరమే. మీ పార్టీలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలని, పార్టీ కేడర్‌కు విలువలు నేర్పాలని సూచిస్తున్నాను. స్త్రీలను గౌరవించడం అనేది మర్యాదకు సంబంధించిన అంశం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
No political goal should blur the line of respect towards women. The vile language used by Congress MLA Danam Nagendar against MP Kangana Ranaut is unacceptable. I may not agree with her opinions or her party’s ideology, but the level of discourse should never sink to such lows…
— KTR (@KTRBRS) September 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాలి..? రోడ్డుప్రమాదాలపై కేటీఆర్ ట్వీట్