ఆదిలాబాద్, ఫిబ్రవరి 3(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్(Adilabad) జిల్లా జైనథ్ మండలంలోని పెండల్వాడ చెరువు పరిసరాల్లో సోలార్ ప్లాంట్ను( Solar plant) ఏర్పాటు చేయవద్దంటూ రైతులు కోరారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. గ్రామంలోని 27 మంది రైతులు 2006లో చెరువు నిర్మాణానికి భూములను ప్రభుత్వానికి విక్రయించామన్నారు.
అధికారులు చెరువు మరమ్మతులు చేయకపోవడంతో నష్టపోతున్నారన్నారు. ఇప్పుడు రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులు వచ్చి చెరువు ఆవరణలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వే చేపట్టినట్లు తెలిపారు. చెరువుకు మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని, ఏమైనా నిర్మాణాలు చేపడితే రైతులు నష్టపోతారని వినతిపత్రంలో సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఇవి కూడా చదవండి..