Peddi sudarshan reddy | ప్రభుత్వ హామీలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ హన్మకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పోలీసులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. రైతు భరోసాపై డిప్యూటీ సీఎంను కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi sudarshan reddy) ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వెళ్లనీయకుండా బీఆర్ఎస్ కార్యాలయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి సహా పార్టీ నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యాలయం చుట్టూ భారీగా మోహరించారు.
ఈ నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు భరోసా విషయంలో కేబినెట్ నిర్ణయం రైతులకు విస్మయం కలిగించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 70 లక్షల మంది రైతులను మోసం చేశారని.. ఆయన వెంటనే రాజీనామా చేయాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. బోనస్ విషయంలో బోగస్ చేసిన్రు. 30 శాతం ధాన్యం కొనుగోలు చేశారు. నాలుగు విడతల్లో కూడా సరిగ్గా రుణమాఫీ చేయలేదన్నారు. నెక్కొండ మండలంలో 600 మందికి పైగా రైతులకు మాఫీ కాలేదు. రూ.7500 చెప్పిరూ.6 వేలకే పరిమితం చేశారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి చేసిన మోసాలపై రైతులు తిరగబడేందుకు సిద్దమయ్యారు. రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులే ఊర్లలో తిరగలేమని చెబుతున్నారు. మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు కూడా తప్పించుకుంటున్నారన్నారు. వరంగల్ నుంచే రైతుల తిరుగుబాబు మొదలైతది. రైతులకున్న రూ.17,500 బాకీ ఎవరు కట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులంతా వ్యవసాయ కూలీలే. జాబ్ కార్డున్న ఉపాధిహామీ కూలీలంతా వ్యవసాయ కూలీలే. జాబ్ కార్డుదారులందరికీ రూ.12 వేల ఇవ్వాల్సిందేనని .. వరంగల్ పర్యటనకు వస్తున్న డిప్యూటీ సీఎం బట్టి రైతులకు క్షమాపణ చెప్పాలని పెద్ది సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి రైతులను అప్పులపాలు చేసే కుట్ర చేస్తున్నారు. ఎకరాల చొప్పున రైతులకు ఎంత బాకీ ఉన్నానో చెప్పేలా పోస్టర్లు వేస్తున్నాం. ప్రతీ గ్రామంలో డబ్బుల వివరాలు ఊరూరా, ఇంటింటికీ పోస్టర్లు వేస్తాం. రైతులకు బాకీపడ్డ వివరాలతో కూడిన పోస్టర్ను విడుదల చేశామని స్పష్టం చేశారు.
KTR | మోసానికి మారు పేరు.. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్: కేటీఆర్