హైదరాబాద్: రైతు భరోసా పథకం కింద రూ.15 వేలు కాకుండా రూ. 12 వేలు ఇస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. మోసానికి మారు పేరు కాంగ్రెస్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ అన్నారు. రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. వరంగల్ డిక్లరేషన్ అబద్ధమని, రాహుల్ గాంధీ ఓరుగల్లులో చేసిన ప్రకటన బూటమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఏటా రూ.15 ఇస్తామంటూ ప్రచారం చేశారని, ఇప్పుడు అమలు చేస్తామంటున్నది రూ.12 వేలని చెప్పారు. ఇది సర్కారు కాదు మోసగాళ్ల బెదిరింపుల మేళా అంటూ విమర్శించారు. అబద్ధానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్.. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్ అంటూ ఎక్స్ వేదిగా విమర్శల వర్షం కురిపించారు.
‘అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!.
అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్. మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం.
మోసానికి మారు పేరు కాంగ్రెస్. ధోకాలకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కార్. రైతుద్రోహి ముఖ్యమంత్రి రేవంత్. రైతుల వ్యతిరేకి కాంగ్రెస్ ప్రభుత్వం. ఒడ్డెక్కి తెడ్డుచూపిన ఇందిరమ్మ రాజ్యం. అన్నింటా మోసం .. వరంగల్ డిక్లరేషన్ అబద్దం. రాహుల్ ఓరుగల్లు ప్రకటన ఒక బూటకం. ప్రచారం రూ.15 వేలు- అమలు చేస్తామంటున్నది రూ.12 వేలు . సిగ్గు సిగ్గు ఇది సర్కారు కాదు మోసగాళ్ల బెదిరింపుల మేళా. అబద్దానికి అంగీ లాగు వేస్తే అది కాంగ్రెస్. మోసానికి మేకప్ వేస్తే అది కాంగ్రెస్!’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అక్కరకు రాని చుట్టము
మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమునఁదా
నెక్కినఁ బారని గుర్రము
గ్రక్కున విడువంగ వలయుఁ గదరా సుమతీ!అక్కరకు రాని ఇందిరమ్మ భరోసా-రైతు భరోసాలో రైతునే మాయం చేసిన కాంగ్రెస్
మొక్కిన ఒక్క పథకం ఇయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
మోసానికి మారు పేరు కాంగ్రెస్
ధోకాలకు కేరాఫ్… pic.twitter.com/oE7ziV5UlI
— KTR (@KTRBRS) January 5, 2025