PAN Card Rules | 1 నుంచి పాన్ రూల్స్ కఠినతరం..ఆధార్‌తోపాటు జనన ధ్రువీకరణ తప్పనిసరి
పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) దరఖాస్తుల కోసం ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కేవలం ఆధార్ ఆధారిత దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయి, సమర్పించవలసిన పత్రాల సంఖ్య మరింత కఠినతరం కానున్నది.
- ఆధార్‌తోపాటు జనన ధ్రువీకరణ తప్పనిసరి
న్యూఢిల్లీ : పర్మనెంట్ అకౌంట్ నంబర్(పాన్) దరఖాస్తుల కోసం ఏప్రిల్ 1 నుంచి దేశంలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న కేవలం ఆధార్ ఆధారిత దరఖాస్తు ప్రక్రియ ముగిసిపోయి, సమర్పించవలసిన పత్రాల సంఖ్య మరింత కఠినతరం కానున్నది. ఆధార్‌ను మాత్రమే ఉపయోగించి పాన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 31తో ముగియనున్నది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులు ఆధార్‌తోపాటు జనన ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ప్రూఫ్ ఆఫ్ బర్త్ కింద సమర్పించాల్సిన పత్రాల్లో బర్త్ సర్టిఫికెట్, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఎస్ఎస్సీ సర్టిఫికెట్, మెజిస్ట్రేట్ జారీచేసే అఫిడవిట్లు వంటివి ఉంటాయి. పాత పాన్ దరఖాస్తులను ఏప్రిల్ 1 నుంచి స్వీకరించబోమని కామన్ సర్వీసెస్ సెంటర్స్ తన సోషల్ మీడియా ఖాతాలో బుధవారం పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

