Narayanapeta | నారాయణపేట : మద్దూరు మున్సిపాలిటీలో తమ గ్రామాన్ని విలీనం చేయొద్దని రెనివట్ల వాసులు ఆందోళనకు దిగారు. మంగళవారం నారాయణపేట జిల్లా మద్దూరు తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బల్దియాలో మా గ్రామాన్ని కలిపితే ఉపాధి హామీ పనులు కోల్పోయే ప్రమాదం ఉన్నదన్నారు.
వ్యవసాయ రంగానికి ఉపయోగపడే నీటి కుంటలు.. పంట పొలాలోల కందకాల తవ్వకాలకు అవకాశం లేకుండాపోతుందన్నారు. దీంతో పంటల సాగుకు తీవ్ర నష్టం కలుగుతుందని వాపోయారు. అభివృద్ధి పనులు మంజూరుకు అవసరమైన అనుమతులు పొందడానికి ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. అందుకే మా గ్రామాన్ని స్వతంత్య్ర గ్రామ పంచాయతీగానే ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంపీడీవో నర్సింహారెడ్డికి వినతి పత్రం అందజేశారు. అనంతరం తాసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ మీదుగా రెనివట్ల రోడ్డు వరకు శాంతియుత ర్యాలీని గ్రామస్తులు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
Wheat Price | మార్కెట్లో రికార్డు స్థాయికి గోధుమల ధర..!
DRDO | లాంగ్రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీవో