DRDO | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఒడిశా తీరం చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR)లో మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM) తొలి ఫ్లయిట్ టెస్ట్‌ని విజయవంతంగా నిర్వహించింది. ఈ టెస్ట్‌లో అన్ని వ్యవస్థలు ఆశించిన విధంగా పని చేశాయని.. ప్రాథమిక మిషన్ లక్ష్యాలను చేరుకున్నాయి. రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ (EOTS), టెలిమెట్రీ వంటి బహుళ శ్రేణి సెన్సార్ల ద్వారా క్షిపణి పనితీరును పర్యవేక్షించారు. మెరుగైన పనితీరు కోసం అధునాతన ఏవియానిక్స్, సాఫ్ట్వేర్లను అమర్చారు. ఎల్‌ఆర్‌ఎల్‌ఏసీఎం అనేది డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, యాక్సెప్టెన్స్ రిక్వైర్మెంట్ ఆమోదించబడిన మిషన్ మోడ్ ప్రాజెక్ట్.
ఇది మొబైల్ ఆర్టిక్యులేటెడ్ లాంచర్ని ఉపయోగించి భూమి నుంచి.. యూనివర్సల్ వర్టికల్ లాంచ్ మాడ్యూల్ సిస్టమ్‌ని ఉపయోగించి ఫ్రంట్‌లైన్ షిప్‌ల నుంచి ప్రయోగించేలా రూపొందించారు. డీఆర్డీవో ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమల సహకారంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ద్వారా ఎల్ఆర్ఎల్సీఎం అభివృద్ధి చేసింది. హైదరాబాద్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్, బెంగళూరు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ క్షిపణి అభివృద్ధి ఉత్పత్తిలో పాలుపంచుకున్నాయి. టెస్ట్ సమయంలో డీఆర్డీవో ప్రయోగశాలలకు చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, త్రివిధ సాయుధ దళాల ప్రతినిధుల సమక్షంలో టెస్ట్ జరిగింది. ఈ సందర్భంగా డీఆర్డీవో, సాయుధ దళాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. భవిష్యత్తులో స్వదేశీ క్రూయిజ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు మార్గం సుగమం చేస్తుందని అన్నారు.
Defence Research and Development Organisation (DRDO) conducted the Maiden Flight Test of Long Range Land Attack Cruise Missile (LRLACM) from the Integrated Test Range (ITR), Chandipur, off the coast of Odisha on November 12, 2024, from a mobile articulated launcher. During the… pic.twitter.com/wmvDYtOFj9
— ANI (@ANI) November 12, 2024