భద్రాద్రి కొత్తగూడెం : ఆరుగాలం కష్టపడి పంటలు పండించి మార్కెట్కు తీసుకొస్తే అధికారులు కొనుగోళ్లు నిలిపివేయడంపై రైతన్నలు కన్నెర్ర చేశారు. వ్యాపారుల తీరును నిరస్తూ ఆందోళన(Farmers agitation) చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు వ్యవసాయ ఉప మార్కెట్లో వ్యాపారులు పత్తి కొనుగోళ్లను(Cotton procuremen) నిలిపివేశారు.
దీంతో అధికారులు, వ్యాపారుల నిబంధనలను నిరసిస్తూ రైతులు ఆందోళనబాట పట్టారు. జూలూరుపాడు రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3 కిలోమీటర్ల మేర వాహనలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులను బుజ్జగించే ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.