Harish Rao | హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. హరీశ్‌రావు వెంట ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
తీవ్ర కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని లీలావతి ఆరోగ్య పరిస్థితి జఠిలంగా మారడంతో శుక్రవారం గుట్టుచప్పుడు కాకుండా బాలికను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఘటనకు జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరామర్శించిన మాజీ మంత్రి @BRSHarish గారు. pic.twitter.com/ytVx4JDXze
— Office of Harish Rao (@HarishRaoOffice) December 14, 2024
ఇవి కూడా చదవండి..
Adilabad | బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ.. గురుకులాల పరిస్థితిపై కేటీఆర్
Hyderabad | గాజులరామారంలో ఆగని భూ కబ్జాలు.. క్వారీ గుంతలను పూడ్చి మరీ నిర్మాణాలు