Adilabad | బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత విరుచుకుపడింది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది.
Adilabad | ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో మరోసారి చిరుత విరుచుకుపడింది. బజార్ హత్నూర్ మండలం డెడ్రాలో బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి చేసింది. చిరుత దాడిలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు గమనించి.. చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. బాధితురాలిని భీమాబాయిగా గుర్తించారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇటీవలే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ యువతిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. జిల్లాలోని కాగజ్‌నగర్ మండల పరిధిలోని బెంగాలీ క్యాంపు ఆరో నెంబర్ విలేజ్ సమీపంలో గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ కూలీకి వెళ్లింది. పత్తి చేనులో పత్తి ఏరుతుండగా.. పులి వెనక నుంచి అకస్మాత్తుగా దాడి చేసింది. ఊహించని పరిణామం యువతి పులిని ప్రతిఘటించలేకపోయింది. దీంతో పులి మహిళ మెడ భాగంలో తీవ్రంగా దాడి చేసింది. గమనించిన మిగతా కూలీలు కేకలు వేశారు. పులి అక్కడి నుంచి పారిపోయింది. మిగతా కూలీలు ఆమెను ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి ఆస్పత్రికి వెళ్లేలోగ మృతి చెందింది.
ఇవి కూడా చదవండి..
KTR | ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ.. గురుకులాల పరిస్థితిపై కేటీఆర్
Group-2 Exams | రేపట్నుంచి గ్రూప్-2 పరీక్షలు.. మంగళసూత్రానికి మాత్రమే అనుమతి
Telangana Talli | ఉద్యమతల్లే ముద్దు… బలవంతంగా రుద్దేతల్లి వద్దే వద్దు : జూలూరు గౌరీశంకర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

