Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని గత ప్రభుత్వ పాలన మీద బురద జల్లే ప్రయత్నం చేశారని మాజ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ఎల్పీలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 57 వేల కోట్ల అప్పులు తెచ్చుకుంటామని బడ్జెట్లో భట్టి విక్రమార్క ప్రతిపాదించారు. గత ప్రభుత్వం కంటే రూ. 17 వేల కోట్ల అప్పులు ఎక్కువగా తెచ్చుకుంటామని ప్రతిపాదించారు. గతంలో ఆర్థిక మంత్రిగా నేను ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 40 వేల కోట్లు ఎఫ్ఆర్బీఎం కింద అప్పులు ప్రతిపాదిస్తే, భట్టి విక్రమార్క మాత్రం రూ. 57 వేల కోట్లు ప్రతిపాదించారు. మా కంటే రూ. 17 వేల కోట్లు ఎక్కువగా చూపించారు అని హరీశ్‌రావు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం ఘనతలను తమ ఘనతలుగా చెప్పుకునే ప్రయత్నం చేసి.. ఈ పదేండ్లలో అభివృద్ధే జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు భట్టి విక్రమార్క. ఈ దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. పదేండ్ల కింద తెలంగాణ 13వ స్థానంలో ఉండే. అక్కడున్న తెలంగాణను ప్రథమస్థానంలోకి తెచ్చాం. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా మెచ్చుకుంది. మేం అభివృద్ధి చేసినట్టా..? చేయనట్టా..? మేం పని చేసినట్టా..? చేయనట్టా..? గత పదేండ్లలో జరిగిన అభివృద్ధి కూడా తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 64 వేల 63 రూపాయాలు ఎక్కువ. ఈ రాష్ట్ర పౌరుడి యొక్క తలసరి ఆదాయం 3,47,299. అయితే దేశ పౌరుడి తలసరి ఆదాయం 1,83,236. అంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఒక లక్షా 64 వేల 63 రూపాయాలు ఎక్కువగా ఉంది.. పదేండ్ల బీఆర్ఎస్ పాలన, కేసీఆర్ పాలన ఫలితం ఇది. మేం అధికారంలోకి వచ్చినప్పుడు 13 స్థానంలో ఉంటే.. ప్రథమ స్థానంలోకి వచ్చామంటే మా పరిపాలనకు గీటురాయి అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
స్థూల ఉత్పత్తి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును సూచిస్తుంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు.. స్థూల ఉత్పత్తి రూ. 4, 51,580 కోట్లు.. ఈసారి 2023-24కు వచ్చేసరికి రూ. 14,63,963 కోట్లు. అంటే జీఎస్డీపీ పెరిగింది.. మూడు రెట్లు పెరిగిదంటే అది మా పనితీరుకు నిదర్శనం. జాతీయ వృద్ధిరేటు 9.1 ఉంటే.. తెలంగాణ వృద్ధి రేటు 11.9 శాతంగా ఉంది. తెలంగాణ వృద్ధిరేటు రెండు శాతం ఎక్కువగా ఉందని హరీశ్‌రావు తెలిపారు.
హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని.. కళ్లుండి చూడలేని కబోదులు అలా మాట్లాడుతారు. భట్టి వ్యాఖ్యలపై హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో మొన్నటి దాకా పని చేసిన ప్రభుత్వం నా కంటే బాగా పని చేసిందని చెబుతూ ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు కేసీఆర్ అభివృద్ధిని కొనియాడారు. హైదరాబాద్ అభివృద్ధిని లోకం మొత్తం మెచ్చింది. రజనీకాంత్ కూడా హైదరాబాద్ అభివృద్ధిని ప్రశంసించారు. ఆ రజినీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు అర్థం కావడం లేదు. ఎంతో మంది హైదరాబాద్‌ను మెచ్చుకున్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం జోక్. ఏ రంగంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదని అర్థమవుతుంది అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 27కు వాయిదా
Maoist Encounter | ములుగు జిల్లాలో గర్జించిన తుపాకులు.. ఎదురుకాల్పుల్లో నక్సలైట్ మృతి
Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు