KCR | బడ్జెట్ ప్రసంగంలా లేదు.. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది.. భట్టి బడ్జెట్ ప్రసంగంపై కేసీఆర్ ఫైర్
KCR | కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.
KCR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బడ్జెట్‌ను చూస్తుంటే ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని తేలిపోయిందన్నారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన అనంతరం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపకం పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతుంది. అట్టడుగు వర్గాల గొంతు కోసింది. దళిత బంధు ప్రస్తావన లేనే లేదు. ఇది చాలా దుర్మార్గం. దళిత సమాజం పట్ల నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇంత గొప్ప నిదర్శనం లేదు. మత్స్యకారులకు భరోసా లేదు. ఇందులో విశేషం ఏంంటంటే.. అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏం లేదు అని కేసీఆర్ పేర్కొన్నారు.
అది ఆల్రెడీ ఉన్న స్కీమే..
మహిళల పట్ల కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే. ఏదో కొత్తగా లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. అది ఆల్రెడీ ఉన్న స్కీమే. దురదృష్టం ఏందంటే.. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేం కూడా కనీసం 6 నెలల సమయం ఇవ్వాలనుకున్నాం. నేను కూడా పెద్దగా శాసనసభకు రాలేదు. కానీ ఈ రోజు బడ్జెట్ చూస్తే.. ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటివరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనబడుతలేదు అని కేసీఆర్ తెలిపారు.
ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం..
వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థీరికరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్లెమో ఎగ్గొడుతామని చెబుతున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం.. చెడగొట్టినం.. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని తెలుస్తుంది. ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్ సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. కాబట్టి రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బడ్జెట్ ప్రసంగంలా లేదు.. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది..
ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి..? ఏం లేదు వట్టిదే గ్యాస్.. ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప బడ్జెట్లాగా లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి..? పారిశ్రామిక పాలసీ ఏమిటి..? ఐటీ పాలసీ ఏమిటి..? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి..? అనే ఏ ఒక్కదాని మీద కూడా స్పష్టత లేదు. అంత వట్టిదే గ్యాస్, ట్రాషే. చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు.. ఎవరి బడ్జెటో రేపు మీకు విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్‌లో బ్రహ్మాండంగా చీల్చి చెండాడబోతాం అని కేసీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Telangana Budget | భూమిలేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు : ఆర్థిక మంత్రి
Telangana Budget | 33 రకాల వరి పంటలకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించాం: భట్టి విక్రమార్క
Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhuvneshwar Kumar: గాయపడ్డ అర్షదీప్.. భారత బృందంలోకి భువనేశ్వర్
Warangal | వరంగల్ డిఐజి ఆఫీస్‌లో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
Rajnath Singh | దేశాన్ని అస్తిర పరిచేందుకు, ప్రభుత్వాన్ని కూల్చేందుకే ఆందోళనలు.. ఇండియా బ్లాక్‌పై రాజ్‌నాథ్ సింగ్ ఆరోపణ
KTR | ఆంధ్రలో జల పండగ ఎట్లయితది? తెలంగాణలో కరువు ఎందుకుంటది? సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

