Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు
తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు.
హైదరాబాద్: తెలంగాణ 2024-25 వార్షిక బడ్జెట్‌ను (Telangana Budget) ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ప్రతిపాదించారు. సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించినట్లు తెలుస్తోంది.
మెట్రో వాటర్ వర్క్స్‌కు రూ.3,385 కోట్లు, నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు, జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు, వ్యవసాయానికి రూ.72,659 కోట్లు, ఉద్యానవనం రూ.737 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.1,980 కోట్లు కేటాయించారు. ఇక రూ.500 గ్యాస్ సిలిండర్ పథకం కోసం రూ.723 కోట్లు, గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్లు ప్రతిపాదించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో కేటాయింపులు ఇలా..
- మెట్రో వాటర్ వర్క్స్- రూ.3,385 కోట్లు
- హైడ్రా సంస్థ- రూ.200 కోట్లు
- జీహెచ్ఎంసీలో మౌలిక వసతులు కల్పన- రూ.3,065 కోట్లు
- హెచ్ఎండీఏలో మౌలిక వసతుల కల్పన- రూ.500 కోట్లు
- విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణ- రూ.100 కోట్లు
- హైదరాబాద్ నగర అభివృద్ధికి- రూ10 వేల కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు- రూ.1500 కోట్లు
- ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు- రూ1525 కోట్లు
- పాతబస్తీ మెట్రో విస్తరణకు- రూ.500 కోట్లు
- మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్- రూ.50 కోట్లు
- ఔటర్ రింగ్ రోడ్డుకు- రూ.200 కోట్లు
- హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు- రూ.500 కోట్లు
కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ పద్దు రూ. 2.75 లక్షల కోట్లు. పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఓటాన్ అకౌంట్ కంటే కొంత పెరిగే అవకాశం ఉంది. నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, జూలై నెలాఖరుతో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమయం ముగియనుంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

