Harish Rao | ఓట్ల ముందు గ్యారెంటీల గారడీ.. గెలిచిన తర్వాత అంకెల గారడీ.. భట్టి బడ్జెట్‌పై హరీశ్‌రావు సెటైర్లు
Harish Rao | ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ భట్టి విక్రమార్క బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి, పరనిందలా ఉందని విమర్శించారు.
Harish Rao | హైదరాబాద్ : ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ భట్టి విక్రమార్క బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు సెటైర్లు వేశారు. ఇవాళ తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎలా ఉందంటే.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆత్మస్తుతి, పరనిందలా ఉందని విమర్శించారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఓట్ల ముందు గ్యారెంటీల గారడీ.. గెలిచిన తర్వాత అంకెల గారడీ.. ప్రజలను బురిడి కొట్టిచేందుకు, భ్రమలు పెట్టించేందుకు భట్టి తన బడ్జెట్ ప్రసంగంలో చాలా ప్రయత్నాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది మొదటి బడ్జెట్. ఈ బడ్జెట్లో దశదిశ ఇస్తారు అనుకున్నాం కానీ దశదిశ ఇవ్వలేదు. రాష్ట్రాన్ని తిరోగమన దిశలో నడిపేటటువంటి బడ్జెట్ ఇది. ఆరు గ్యారెంటీలు నీరు గారిపోయాయి. సంక్షేమం సన్నగిల్లింది. అభివృద్ధి అగమ్యగోచరమైంది. అన్ని వర్గాలను తీవ్ర నిరాశ పరిచింది. ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ.. ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని అప్పుడేమో బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. ఆరు గ్యారెంటీలకు కేటాయింపులు బడ్జెట్లో లేవు. వాటి కేటాయింపులు లేవి..? ప్రస్తావన ఎక్కడ..? అని హరీశ్‌రావు నిలదీశారు.
కోటి మంది అక్కాచెల్లెళ్లకు 20 వేల కోట్లకు పైగా బాకీ..
ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల మేనిఫెస్టోను ప్రతిబించించే విధంగా బడ్జెట్ ఉండాలి. కానీ కాంగ్రెస్ తన మేనిఫెస్టోను మరిచిపోయినట్టు ఉంది. వారి ఆరు గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు రూ. 2500 చొప్పున ప్రతినెల ఇస్తామన్నారు. ఈ బడ్జెట్లోనైనా వాటికి నిధులు కేటాయింపు చేస్తారేమో అనుకున్నాం. 18 ఏండ్లు నిండిన కోటి మంది అక్కాచెల్లెళ్లకు శుభవార్త వినిపిస్తారేమో అనుకుంటే నిరాశ చూపారు. 8 నెలల లెక్క తీస్తే 20 వేల కోట్లకు పైగా బాకీ పడ్డారు. మహాలక్ష్మి పథకం మహిళలకు మహా నిరాశను మిగిల్చారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు..
ఆసరా పెన్షన్ల కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అవ్వతాతలకు ఇచ్చే రూ. 4 వేల పెన్షన్ ప్రస్తావన కూడా లేదు. ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి రెచ్చిపోయి ప్రసంగించారు. రూ. 4 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే డిసెంబర్లో పెన్షన్లు ఇస్తామన్నారు. జులై నెలలో ఉన్నాం ఇప్పటి వరకు రాలేదు. ఇంటికి రెండు పెన్షన్లు, కొత్త పెన్షన్లు, నౌకరి ఉన్న ఇస్తామని ఊదరగొట్టారు. 100 రోజుల్లో ఇస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చారు. మరి బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదు. మాది పేదల ప్రభుత్వం అని అన్నారు కదా… ఆసరా పెన్షన్లు అందుకునే నిరుపేదల కంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పేదవాళ్లు ఉన్నారా..? వీళ్ల కంటే పేదలు, కష్టాల్లో ఉన్నవారు ఎవరైనా ఉంటారా..? పేదల ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కొండంత ఆశతో ఎదురుచూస్తున్న వృద్ధులను, ఒంటరి మహిళలను, దివ్యాగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వలేదు..
విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డు ముచ్చట లేదు. నిరుద్యోగులకు 4 వేల భృతి గురించి మాట్లాడలేదు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 8 నెలలు అయిపోంది మిగిలింది 4 నెలలే. ఉద్యోగాల గురించి ప్రస్తావనే లేదు. ఉద్యోగ నియామకాలపై స్పష్టత ఇవ్వలేదు. స్కూటీలు ఇస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు పదిలో పాసైతే పది వేలు ఇస్తామన్నారు. వాటి ప్రస్తావనే లేదు. విద్యార్థులను కూడా మోసం చేశారు అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 27కు వాయిదా
Maoist Encounter | ములుగు జిల్లాలో గర్జించిన తుపాకులు.. ఎదురుకాల్పుల్లో నక్సలైట్ మృతి
Telangana Budget | 2.91లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్.. వ్యవసాయానికి 72 వేల కోట్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

