Harish Rao | హైదరాబాద్ : గ్రూప్-1 నియామకాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 55ని కాదని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చి.. నిరుద్యోగుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. జీవో 29ను రద్దు చేయాలని అసెంబ్లీ సాక్షిగా జులై 29 అర్ధారాత్రి వేళ మాట్లాడిన వ్యాఖ్యలను హరీశ్‌రావు మరోసారి గుర్తు చేశారు. ఈ విషయంలో మీటింగ్ పెడితే తప్పకుండా వచ్చి వివరణ ఇస్తానని చెప్పిన హరీశ్‌రావు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సరేఅన్నట్టు తలూపారు. కానీ ఇవాళ భట్టి విక్రమార్క నోరెత్తడం లేదు.
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది అని హరీశ్‌రావు పేర్కొన్నారు. అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారిందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నది.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. భేషజాలు పక్కనబెట్టి జీవో నెంబర్ 29ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
జీవో 29 రద్దు చేసి, గ్రూప్స్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జులై 29న అర్ధరాత్రి అసెంబ్లీలో మాట్లాడిన సంఘటన నాకు గుర్తుకువస్తున్నది.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావు. వారిని అరెస్టులు చేసి… pic.twitter.com/StkhuTbPOX
— Harish Rao Thanneeru (@BRSHarish) October 19, 2024
ఇవి కూడా చదవండి..
KTR | పేపర్ లీకులు తప్ప.. బండి సంజయ్‌కు గ్రూప్-1 గురించి ఏం తెలుసు..! కేటీఆర్ ఎద్దెవా
KTR | గ్రూప్-1 అభ్యర్థులను పశువుల మాదిరిగా చూడడం దారుణం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్