Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చుక్కలు చూపించారు. నిన్న సచివాలయంలో మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడిన ప్రతి మాటకు హరీశ్‌రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలు.. ఆలోచన లేని మాటలు అని హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఇక తనకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యస్పాదంగా ఉందని హరీశ్‌రావు ఫైర్ అయ్యారు.
‘నాకు ఎమ్మెల్యే పదవి లేనప్పుడు మంత్రి పదవి ఇచ్చారని రేవంత్ రెడ్డి అంటుండు. ఆ టైమ్‌లో నువ్వు యేడున్నవ్. బీఆర్ఎస్ పార్టీలో నా శిష్యుని కింద ఉన్నవ్. నేను మంత్రి అయిన నాడు నా కారు ముందు నాతో పాటు డ్యాన్స్ చేసినోడివి నువ్వు. నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్కు వద్ద నా వెనుక నిలబడి.. నువ్వు చిన్నగ ఉంటవ్ కాబట్టి నిక్కి నిక్కి టీవీలో కనబడేందుకు చూసినోడివి నువ్వు.. మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటిసారి ఎమ్మెల్యే అయినవ్.. నీకు కృతజ్ఞత ఉన్నదా.. బీఆర్ఎస్ పార్టీ మీద..? అసలు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతికత నీకు ఎక్కడిది..? సోనియా గాంధీ బలిదేవత.. వెయ్యి మందిని చంపింది అన్న నువ్వు ఇవాళ కాంగ్రెస్ గురించి మాట్లాడవడితివి’ అని రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు నిప్పులు చెరిగారు.
నేను మంత్రి అయిన రోజు నా కారు ముందు రేవంత్ రెడ్డి డాన్స్ వేసాడు
నేను మంత్రిపదవికి రాజీనామా చేసినపుడు గన్ పార్క్ దగ్గర నా వెనక నిలబడి.. పొట్టిగా ఉంటావు కాబట్టి నిక్కీ నిక్కీ టీవీలో కనపడడానికి చూసినోడివి నువ్వు
మా బీఆర్ఎస్ పొత్తుతోనే నువ్వు మొదటి సారి ఎమ్మెల్యే అయ్యావు.. మరి… pic.twitter.com/uHKJoo6OcD
— Telugu Scribe (@TeluguScribe) October 18, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్