Harish Rao | హైదరాబాద్ : గతంలో ఇదే తెలంగాణ గడ్డపై గుర్రాలతో తొక్కించిన నీచ సంస్కృతి నీ కాంగ్రెస్ పార్టీది.. టీడీపీలది అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
ఓట్లేసిన పాపానికి మీరు వాళ్లను ముంచిండ్రు.. గుర్రాలతో తొక్కించిండ్రు.. అని రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు హరీశ్‌రావు. రేవంత్ రెడ్డి.. గుర్రాలతో తొక్కించిన సంస్కృతి నీ కాంగ్రెస్ పార్టీది, నువ్వు గతంలో ఉన్న తెలుగు దేశం పార్టీకి ఉంది తప్ప మాకు లేదు. ఆశా వర్కర్లను, అంగన్వాడీలను అసెంబ్లీ ముందు గుర్రాలతో తొక్కించి, వాటర్ క్యాన్లతో కొట్టించిన చరిత్ర నీ కాంగ్రెస్ పార్టీది. పెంచిన కరెంట్ బిల్లులను తగ్గించమని చెప్పితే గుర్రాలతో తొక్కించిన ఘనత గతంలో నువ్వున్న టీడీపీ పార్టీది. గుర్రాలతో తొక్కించే సంస్కృతి మాకు లేనే లేదని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
శత్రుదేశాల మీద దాడికి పోయినట్టు.. రేవంత్ రెడ్డి పేదల ఇంటిమీద దాడి చేస్తున్నాడు. నిర్మాణాత్మకమైన పనితో పని ప్రారంభం కావాలి.. కానీ విధ్వంసంతో నువ్వు పని ప్రారంభం చేస్తున్నావు అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. మీకు దమ్ముంటే మేము మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి. ఆక్రమణలు చేస్తున్నది పేద ప్రజలు కాదు, నువ్వే అక్రమంగా పేదల భూములు ఆక్రమణలు చేస్తున్నావ్. ఫోర్త్ సిటీ ఎక్కడ పెడుతున్నావ్. రియల్ ఎస్టేట్ చేస్తున్నావ్. ఎందుకు బ్లఫ్ చేస్తున్నావ్. నల్లగొండ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావ్. రాజకీయాలు చేస్తున్నావ్. నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నల్లగొండ ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే పారిశ్రామిక వ్యర్థాలు చెరువుల ద్వారా మూసీలో చేరకుండా తీసుకోవాల్సిన చర్యలు ప్రారంభించు. మూసీ పునరుజ్జీవనానికి మేం వ్యతిరేకం కాదు. నీ బుల్డోజర్ విధానాలకు, మీ రియల్ ఎస్టేట్ దందాలకు మేం వ్యతిరేకం. నువ్వు ఎంత వెకిలి దాడి చేసినా సరే బాధితులైన ప్రజల పక్షాన నిలబడుతం. నీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటిస్తం అని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Aspirants | అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత.. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీలు ఝులిపించిన పోలీసులు
Telangana | 9 యూనివర్సిటీలకు వీసీల నియామకం.. ఓయూ వైస్ ఛాన్సలర్‌గా కుమార్
Harish Rao | గురివింద గింజ తన కింద నలుపు తెల్వదన్నట్టు.. రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు కౌంటర్