Harish Rao | హైదరాబాద్ : ముఖ్య నేతల కోసమే ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్ మార్చారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని కొంత మంది నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.
రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) దక్షిణ భాగం కేంద్ర ప్రభుత్వం నిర్మించాలి. కానీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కావాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తానంటోంది. రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తే ప్రజలపై రూ. 20 వేల కోట్ల భారం పడుతుంది. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం 158 కి.మీ. మేర కేంద్రమే నిర్మిస్తోంది. ఉత్తర భాగం నిర్మాణం కోసం భూసేకరణ ఇంకా ప్రారంభించలేదని హరీశ్‌రావు తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రతి నియోజకవర్గానికి రూ. 5 కోట్లు ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. 6 నెలలు అవుతున్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వెంటనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఉన్న పథకాలు బంద్ పెట్టడమే కాంగ్రెస్ తెచ్చిన మార్పు. మహిళలకు 2 బతుకమ్మ చీరలు ఇస్తామని రేవంత్ రెడ్డి మోసం చేశారు. రూ. 15 వేలు రైతుబంధు అన్నారు.. గుండుసున్నా చేశారు. కేసీఆర్ కిట్ కంటే మంచిది ఇస్తామని పేద గర్భిణులను మోసం చేశారు. ఆగస్టులో వేయాల్సిన చేప పిల్లలను, అక్టోబర్‌లో వచ్చినా వేయలేదు. చేప పిల్లల కోసం బడ్జెట్లో రూ. 16 కోట్లే పెట్టారని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Road Accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
IAS Officers | ఐఏఎస్ అధికారులకు చుక్కెదురు.. పిటిషన్లను డిస్మిస్ చేసిన హైకోర్టు