హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడచిపోయినప్పటికీ.. ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. సంక్షేమ పథకాలు అమలుకు నోచుకోవడం లేదు.. ఆసరా పెన్షన్ల ఊసే లేదు. దీంతో పెన్షన్‌దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చేయూత పింఛన్ లబ్ధిదారుల కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కథనం ప్రకారం.. చేయూత పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 43.3 లక్షలు ఉంటే, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 42.7 లక్షలకు తగ్గిపోయిందని హరీశ్‌రావు తెలిపారు. అంటే 60 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందకుండా చేసింది కాంగ్రెస్ సర్కారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ. 2000 నుండి రూ. 4000కి ఆసరా పింఛన్లు పెంచడం దేవుడెరుగు, కానీ లబ్ధిదారుల సంఖ్యలో కోతలు మాత్రం ప్రారంభించారు. ఇది చేతల ప్రభుత్వం కాదు,
సంక్షేమ పథకాల్లో కోతలు విధించే ప్రభుత్వం అని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కథనం ప్రకారం, చేయూత పింఛన్ లబ్ధిదారుల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరంలో 43.3 లక్షలు ఉంటే, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 42.7 లక్షలకు తగ్గిపోయింది.
అంటే 60 వేల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందకుండా చేసింది కాంగ్రెస్ సర్కారు.
రూ. 2000 నుండి రూ. 4000కి… pic.twitter.com/QgNp3Z5SMI
— Harish Rao Thanneeru (@BRSHarish) January 22, 2025
ఇవి కూడా చదవండి..
KTR | నేడు టెంట్లను కూలగొట్టినట్టే.. రేపు ఏదో దశలో ఈ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు : కేటీఆర్
Gandhi Bhavan | గాంధీ భవన్లో కొట్టుకున్న యూత్ కాంగ్రెస్ నేతలు
KTR | బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు