Harish Rao | హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతిపట్ల మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్‌కు ఆయన చేసిన కృషి, సుధీర్ఘ ప్రజా సేవ ఆయన అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబ సభ్యులకు, బెంగాల్ ప్రజలకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. బుద్ధదేవ్ ఆత్మకు శాంతి చేకూరాలని హరీశ్‌రావు ప్రార్థించారు.
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య గురువారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వయసు 80 ఏళ్లు. ఆయన 11 ఏళ్ల పాటు బెంగాల్ సీఎంగా చేశారు. 2000 నుంచి 2011 వరకు ఆయన బెంగాల్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. తండ్రి బుద్దదేవ్ మరణించినట్లు కుమారుడు సుచేతన్ భట్టాచార్య ప్రకటించారు. బెంగాల్‌కు ఆరో సీఎంగా పని చేశారాయన. బెంగాల్లో సుమారు 34 ఏళ్లు వామపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ఏలాయి. దాంట్లో చివరి సీఎంగా బుద్దదేవ్ విధులు చేపట్టారు.
కోల్‌కతాలోని పామ్ అవెన్యూలో ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు ప్రాణాలు విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చాన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించింది. శ్వాసకోస వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. పలుమార్లు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఇటీవల నుమోనియా సోకడంతో ఆయన లైఫ్ సపోర్టుపై ఉన్నారు.
Deeply saddened by the demise of Shri Buddhadeb Bhattacharjee, former Chief Minister of West Bengal. His contributions to West Bengal and his long public service are a testament to his dedication. My heartfelt condolences to his family and the people of West Bengal. May his soul… pic.twitter.com/PmUHVSy3OG
— Harish Rao Thanneeru (@BRSHarish) August 8, 2024
ఇవి కూడా చదవండి..
RBI: వరుసగా 9వ సారి.. కీలక వడ్డీ రేట్లు యధాతథం
Protests | కూరగాయల ధరల పెరుగుదలపై విపక్షాల ఆందోళన.. ఉల్లిపాయల దండతో ఎంపీల నిరసన
Continents | ఖండాలు ఏడు కాదు ఆరే.. ఉత్తర అమెరికా, యూరప్ ఇంకా విడిపోలేదట!