Protests | దేశంలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి (vegetable price hike). అరకొర సంపాదనతో బతుకు బండి లాగుతున్న సామాన్యులు కూరగాయలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రతి వంటలోనూ తప్పనిసరిగా ఉపయోగించే ఉల్లిపాయలు (onion) ప్రస్తుతం సామాన్యుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. గత నాలుగైదు నెలల నుంచి ఉల్లి ధరలు పైపైకే వెళ్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కేజీ ఉల్లిపాయల ధర రూ.50కిపైనే పలుకుతోంది. కొన్ని చోట్ల రూ.60కి విక్రయిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉల్లి, ఇతర కూరగాయల ధరల పెరుగుదలపై విపక్ష ఇండియా కూటమి పార్టీల ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు (Opposition protests). ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, శివసేన (యూబీటీ) సహా వివిధ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు గురువారం ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఉల్లిపాయలతో చేసిన దండలను మెడలో వేసుకుని ధరలు తగ్గించాలంటూ మకర ద్వారం వద్ద నినాదాలు చేశారు.
#WATCH | Delhi | MPs from different political parties in opposition protest against the price rise of onions and other vegetables, outside the parliament. As a mark of protest, MPs also wear garlands made of onion as they raise the slogan ‘pyaaj ka daam kam karo…’. pic.twitter.com/pt2Qqr4tmq
— ANI (@ANI) August 8, 2024
Also Read..
Brain Infection | అరుదైన మెదడు సంబంధిత వ్యాధితో కేరళలో ఐదు మరణాలు : వీణా జార్జ్
Bangladesh crisis | బంగ్లాలో అస్థిర పరిస్థితులు.. భారత వీసా సెంటర్లు మూసివేత
Sheikh Hasina | ఈ కష్టసమయంలో మా అమ్మను చూడలేకపోతున్నా.. హసీనా కుమార్తె భావోద్వేగ పోస్ట్