Sheikh Hasina | ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో పొరుగు దేశం బంగ్లాదేశ్లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాగ్రహానికి జడిసి ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా (Sheikh Hasina) రాజీనామా చేసి దేశం వీడారు. ప్రస్తుతం హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితులపై హసీనా కుమార్తె (Hasina Daughter) సైమా వాజెద్ (Saima Wazed) స్పందించారు. ఈ కష్టసమయంలో తన తల్లిని చూడలేకపోతున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
‘నేను ఇష్టపడే నా దేశం బంగ్లాదేశ్లో జరిగిన ప్రాణనష్టం చూసి గుండె పగిలింది. ఈ కష్ట సమయంలో నా తల్లిని చూడలేకపోయాననే, కౌగిలించుకోలేకపోయానే అన్న బాధ నా గుండెను పిండేస్తోంది. ప్రపంచ ఆరోగ్యసంస్థలో రీజినల్ డైరెక్టర్గా నా విధి నిర్వహణకు కట్టుబడి ఉండాల్సి వచ్చింది’ అని సైమా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
కాగా, షేక్ హసీనాకు ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే. కుమార్తె సైమా వాజెద్, కుమారుడు సాజీద్ వాజెద్ జాయ్ ఉన్నారు. సైమా ఈ ఏడాది ఫిబ్రవరిలో డబ్ల్యూహెచ్వోకు ఎన్నికయ్యారు. ఆగ్నేయ ఆసియా రీజినల్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్లోని జెనీవాలో నివాసం ఉంటున్నారు. ఇక హసీనా కుమారుడు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే.
Heartbroken with the loss of life in my country 🇧🇩 that I love. So heartbroken that I cannot see and hug my mother during this difficult time. I remain committed to my role as RD @WHOSEARO @WHO #HealthForAll #OneWHO
— Saima Wazed (@drSaimaWazed) August 8, 2024
Also Read..
Shyam Prasad Reddy | ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఇంట విషాదం
Rashmika Mandanna | మరాఠి భాషపై కన్నడ భామ రష్మిక మందన్నా ఫోకస్.. ఎందుకో తెలుసా..?
Buddhadeb Bhattacharya: బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య కన్నుమూత