ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్‌టైన్స్‌మెంట్ అధినేత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి (Shyam Prasad Reddy) ఇంట్లో విషాదం నెలకొంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి కుమార్తె, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి సతీమణి వరలక్ష్మి కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె బుధవారం రాత్రి మరణించారు. గురువారం సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మి మృతిపట్ల తెలుగు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. అమ్మోరు, అంజి, తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అరుంధతి వంటి హిట్ సినిమాలను రూపొందించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ బ్యార్లో జబర్దస్త్, ఢీ వంటి పలు సూపర్‌హిట్ టీవీ షోలు, సీరియళ్లు నిర్మిస్తున్నారు.