Rashmika Mandanna | ప్రొఫెషనల్‌గా ఉండే నటీనటులకు ఇండస్ట్రీలో కొదవేమి లేదు. అలాంటి యాక్టర్ల జాబితాలో టాప్‌లో ఉంటుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). పుష్ప ది రైజ్ సినిమాతో జాతీయ స్థాయిలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నేషనల్ క్రష్ బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలు చేస్తూ పుష్పలోని తగ్గేదే లే అని డైలాగ్ చెప్పకనే చెబుతోంది. ఈ భామ నటిస్తోన్న సినిమాల్లో పుష్ప ది రూల్‌తోపాటు బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ Chhava కూడా ఉంది.
విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ మూవీలో విక్కీ కౌశల్ ఛత్రపతి శివాజీ మహరాజ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో రష్మిక ఛత్రపతి సతీమణి ఏసుబాయ్గా నటిస్తోంది. కథానుగుణంగా సినిమా పూర్తిగా మరాఠి భాషలో సాగనుంది. ఈ నేపథ్యంలో రష్మిక మరాఠి భాష నేర్చుకునే పనిలో పడిందన్న వార్త బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
రష్మిక ఈ ప్రాజెక్టుపై చాలా ఆశలే పెట్టుకుందని, ఏసుబాయ్ పాత్రకు న్యాయం చేయాలంటే ఒరిజినల్ వాయిస్ అయితే బాగుంటుందని భావించిన రష్మిక మరాఠి పాఠాలు నేర్చుకునే పనిలో పడిందట. మొత్తానికి ఏదేమైనా కన్నడ నుంచి ఎంట్రీ ఇచ్చి.. ఓ వైపు తెలుగులో మాట్లాడుతూనే.. మరోవైపు మరాఠి భాషలో ప్రావీణ్యం సంపాదించుకోవాలనే రష్మిక ప్రయత్నానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు. రష్మిక ఖాతాలో ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప ది రూల్, ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర, యానిమల్ 2 కూడా ఉన్నాయి.
Ram Pothineni | బాలీకి వెళ్లి 18 కిలోలు బరువు తగ్గా.. డబుల్ ఇస్మార్ట్ క్లైమాక్స్‌పై రామ్
Rishab Shetty | 24 ఏండ్ల నిరీక్షణ.. కాంతార హీరో రిషబ్ శెట్టి కల నెలవేరిన వేళ..!
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!