Rishab Shetty | శాండల్‌వుడ్ (కన్నడ) నుంచి ఎలాంటి అంచనాలు లేకుండా ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌తోపాటు పాన్ ఇండియా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా నిలిచాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). ఈ టాలెంటెడ్ యాక్టర్ తెరకెక్కించిన కాంతార ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అగ్రదర్శక నిర్మాతల ఫోకస్ కన్నడ ఇండస్ట్రీవైపు పడేలా చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరికైనా ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. అందరిలాగే రిషబ్ శెట్టికి ఓ కల ఉంది. అది కూడా 24 ఏండ్లకు నెరవేరింది. ఇంతకీ ఏంటా డ్రీమ్ అనే కదా మీ డౌటు.
రిషబ్ శెట్టి ఎంతగానో అభిమానించే నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram). ఎప్పటికైనా విక్రమ్‌ను కలవాలనుకునేవాడట. ఆ కోరిక మొత్తానికి నేటికి తీరింది. విక్రమ్ తంగలాన్ ప్రమోషన్స్‌లో భాగంగా బెంగళూరులో సందడి చేశాడు. ఈ సందర్భంగా విక్రమ్ కలిశాడు రిషబ్ శెట్టి. ఈ అరుదైన సందర్భాన్ని అందరితో పంచుకున్నాడు రిషబ్ శెట్టి.
నటుడిగా అయ్యే క్రమంలో నా ప్రయాణానికి స్ఫూర్తి విక్రమ్ సార్. 24 ఏండ్ల నిరీక్షణ.. నా ఐడల్ విక్రమ్ సార్‌ను కలవడం ఆనందంగా ఉంది. ఈ భూమిపై అదృష్టవంతుడైన వ్యక్తి నేనే అనే భావన కలుగుతోంది. నా లాంటి నటులకు స్ఫూర్తినిచ్చినందుకు ధన్యవాదాలు. మీ తంగలాన్ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా.. లవ్ యూ చియాన్ అంటూ సోషల్ మీడియాలో తన ఎక్జయిటిమెంట్ను షేర్ చేసుకున్నాడు కాంతార హీరో. ఇప్పుడీ స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాబోయే రోజుల్లో రిషబ్ శెట్టి, విక్రమ్ కాంబినేషన్లో సినిమా వస్తే ఎంత బాగుంటుందో అని ఈ ఇద్దరిని ఓకే ఫ్రేమ్‌లో చూసిన నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
విక్రమ్‌తో ఇలా..
In my journey in becoming an actor, #Vikram Sir has always been my inspiration.
After 24 long years of waiting, meeting my idol today makes me feel like the luckiest person on Earth.
Thank you for inspiring actors like me, and wishing you all the best for #Thangalaan.
Love… pic.twitter.com/CrmwnW4CEM— Rishab Shetty (@shetty_rishab) August 6, 2024
They Call Him OG | ఓజీతోపాటు మరిన్ని.. పవన్ కల్యాణ్ బర్త్ డేకు అదిరిపోయే ప్లాన్..!
Kavya Thapar | ఇస్మార్ట్ శంకర్ ఆడిషన్స్‌కు వెళ్లా కానీ.. కావ్య థాపర్ డబుల్ ఇస్మార్ట్ విశేషాలు
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!