Kavya Thapar | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni), పూరీజగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. ఇందులో భాగంగా కావ్యథాపర్ మీడియాతో చిట్ చాట్ సెషన్లో డబుల్ ఇస్మార్ట్ విశేషాలు షేర్ చేసుకుంది.
డబుల్ ఇస్మార్ట్‌లో అవకాశం ఎలా వచ్చింది..?
పూరీ, ఛార్మీ మేడమ్‌కు ఆడిషన్స్ లో నా పర్ఫార్మెన్స్ నచ్చింది. చిన్న ప్రమాదం కారణంగా కొంత బరువు పెరిగా. అందువల్ల బరువు తగ్గాలని వాళ్లు నాకు సూచించారు. రెండు నెలల హార్డ్ వర్క్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ పాత్రకు సెట్ అయ్యాను. రామ్, సంజయ్ దత్ సార్‌తో పనిచేయడం థ్రిల్‌గా ఫీలయ్యా. పూరీ, మణిశర్మ సార్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించింది. ఆసక్తికర విషయమేంటంటే.. ఇస్మా్ర్ట్ శంకర్‌కు ఆడిషన్స్ ఇచ్చా.. కానీ ఆ సినిమాకు సెలెక్ట్ అవలేదు.
రామ్‌తో పనిచేయడంపై..
రామ్ చాలా కష్టపడే తత్వమున్న వ్యక్తి.. సినిమాపై ప్యాషన్ ఉన్న ఎనర్జిటిక్ పర్సన్‌తో పనిచేయడం అద్బుతంగా అనిపించింది.
పూరీ, ఛార్మీ నుంచి ఏం నేర్చుకున్నారు..?
చాలా సహనాన్ని, స్పష్టతను నేర్చుకున్నా. పూరీ చాలా క్లియర్ విజన్‌తో సెట్లో నిశ్శబ్దంగా ఉంటారు. జీవితం లోతుల గురించి తెలిసిన గొప్ప ఫిలాసఫర్ ఆయన. ఛార్మీ మేడమ్ ఓ పవర్ హౌస్. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందరితో స్నేహంగా ఉండటమే కాకుండా పూర్తి సహకారాన్ని అందిస్తారు. ఆమెను చాలా స్పూర్తిగా తీసుకుంటా.
డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉండబోతుంది..?
డబుల్ ఇస్మార్ట్ ఇస్మార్ట్ శంకర్ కంటే భిన్నంగా డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఈ సినిమాకు పనిచేయడం గొప్పగా భావిస్తున్నా. ఆగస్టు 15న విడుదలవుతుండటం పట్ల చాలా ఎక్జయిటింగ్‌గా ఉంది.
మీ కొత్త సినిమాల సంగతేంటి.. ?
గోపీచంద్ సార్‌తో విశ్వం సినిమా చేస్తున్నా. పలు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయి.
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!