Shraddha Kapoor | సాహో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ . ఈ బ్యూటీ రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తోన్న తాజా సీక్వెల్ ప్రాజెక్ట్ ‘స్త్రీ’ (Stree 2). పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటిస్తున్నాడు. కామెడీ హార్రర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్నాడు.
షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రయూనిట్. తాజాగా స్త్రీ 2 నుంచి తుమ్హారే హి రహేంగే హమ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ రావు, శ్రద్దాకపూర్ మధ్య సాగే అందమైన లవ్ ట్రాక్ నేపథ్యంలో ఉండబోతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
ఇప్పటికే లాంచ్ చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
The beautiful melody of #TumhareHiRahengeHum from #Stree2 is addictive #RajkummarRao and #ShraddhaKapoor bring their love story to life with every note. Song out now!#Stree2 in theatres this Independence Day!
Link: https://t.co/ySDwnSPrS9@ShraddhaKapoor @RajkummarRao… pic.twitter.com/Y3kDJ7RhzD
— Atul Mohan (@atulmohanhere) August 6, 2024
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!