కుభీర్ : బీఆర్ఎస్ ( BRS ) పార్టీ నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ( New Sarpanchs ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ మండల నాయకుడు రేకుల గంగాచరణ్ ( Gangacharan) పేర్కొన్నారు.
నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుభీర్, నిగ్వా, పార్డి కె, పార్డి (బీ), బెల్గాం, ధార్ కుభీర్, పల్సి, సిరిపెల్లి (హెచ్), సోనారి, మలేగాం, చోండి, జాంగాం, గోడ్సేరా, హంపోలి, గోడపూర్, సాంవ్లీ తో పాటు పలు గ్రామాల నూతన సర్పంచులను, ఉపసర్పంచులను ఆయన శాలువా పూలమాలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ గా ఎన్నిక కావడం అంటే ప్రజల మనసులను దోచుకోవడమేనని అన్నారు. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కూడా అంతే కీలకమైనదని అన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల మన్ననలను పొందాలని సూచించారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో పల్లెలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయని, కాంగ్రెస్ పాలనలో పల్లెలు అందవికారంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచులు కందూరి సాయినాథ్, మెంచు రమేష్, బందెల గంగామణి సత్యనారాయణ, సతీష్, నరసింహ, షెల్కి లక్ష్మీ ఆనంద్ తో పాటు సాంవ్లీ మాజీ సర్పంచ్ శంకర్, మాజీ వైస్ ఎంపీపీ బీ.శంకర్, ఉప సర్పంచులు,గ్రామస్థులు పాల్గొన్నారు.