సూర్యాపేట, డిసెంబర్ 22 : సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచ్‌గా సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే హామీల అమలుకు ఉపక్రమించారు గుంటకండ్ల రామచంద్రారెడ్డి. ‘నాగారం బాపు’గా అంతా పిలిచే ఆయన తన సతీమణి గుంటకండ్ల సావిత్రమ్మ పేరున గ్రామంలోని దళిత వాడలో సొంత ఖర్చులతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు.
దళితవాడ దాహార్తిని తీర్చడంతో అభివృద్ధికి శ్రీకారం చుట్టి అందరిలో ఆనందం నింపారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డికి దళిత కుటుంబాలు డా.బీఆర్.అంబేద్కర్ ఫొటో అందజేసి, శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాయి.
వాటర్ ప్లాంట్ ప్రారంభించిన సర్పంచ్ రామచంద్రా రెడ్డి
