Devara Second Single | టాలీవుడ్, బాలీవుడ్‌తోపాటు ఇతర భాషా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ఒకటి దేవర (Devara). జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్లో రోల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్నాడు. దేవర రెండు పార్టులుగా తెరకెక్కుతుందని తెలిసిందే. దేవర పార్టు 1 సెప్టెంబర్27 న గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేసింది తారక్ టీం. ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం తాజాగా సెకండ్ సింగిల్ చుట్టమల్లె (Chuttamalle) మెలోడీ ట్రాక్‌ను విడుదల చేశారు మేకర్స్. తారక్, జాన్వీకపూర్ కెమిస్ట్రీలో వచ్చే ఈ సాంగ్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతుందని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా..శిల్పా రావు పాడింది.
ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటిస్తున్నాడు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. శంషాబాద్‌లో వేసిన స్పెషల్ సెట్లో జాన్వీకపూర్, తారక్, ఇతర ఆర్టిస్టులపై వచ్చే భారీ సాంగ్‌ను కొరటాల శివ అండ్ టీం షూట్ చేస్తున్నట్టు వార్త ఒకటి ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తుంది.
దేవర నుంచి ఇప్పటికే అనిరుధ్ రవిచందర్ కంపోజిషన్‌లో లాంచ్ చేసిన ఫియర్ సాంగ్ (Fear Song)తోపాటు గ్లింప్స్ నెట్టింట మిలియన్లకుపైగా వ్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.
చుట్టమల్లె సాంగ్..
#DevaraSecondSingle is all yours now 😍❤️🔥
▶️ https://t.co/fYcfaSRCVi #Devara #Chuttamalle #DheereDheere #Paththavaikkum #SwaathimuttheSikkangaithe #KanninathanKamanottam
An @AnirudhOfficial Musical 🎶
🎙️- @ShilpaRao11, @DeepthiSings
✍️ – @Ramjowrites, @KausarMunir,… pic.twitter.com/MNuP8IP0Co— NTR Arts (@NTRArtsOfficial) August 5, 2024
Kangana Ranaut | ఖరీదైన విల్లాను అమ్మకానికి పెట్టిన కంగనారనౌత్..?
Sardar 2 | ఆ వార్తలే నిజమయ్యాయి.. కార్తీ సర్దార్ 2లో హీరోయిన్ ఫైనల్..!