Vishwambhara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) టైటిల్ రోల్లో నటిస్తున్న సోషియో ఫాంటసీ ప్రాజెక్ట్ విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం విశ్వంభరలో వచ్చే హై ఆక్టేన్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ కొనసాగుతోంది.
ఈ చిత్రానికి వార్ 2 చిత్రానికి పనిచేస్తున్న పాపులర్ యాక్షన్ కొరియోగ్రఫర్ Anlarasu పనిచేస్తున్నాడని తెలిసిందే. తాజాగా యాక్షన్ సీక్వెన్స్ కోసం సెట్స్‌లోకి ఎంటరైన విజువల్స్ వీడియోను మేకర్స్ షేర్ చేశారు. చిరు కోసం స్టన్నింగ్ యాక్షన్ పార్టును రెడీ చేసినట్టు తాజా వీడియో చెప్పకనే చెబుతోంది. ఈ మూవీని 2025 జనవరి 10న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ నేపథ్యంలో షూటింగ్‌ను జెట్ స్పీడులో సినిమా పూర్తి చేసేలా పనిలో మేకర్స్ బిజీగా ఉన్నారని తాజా అప్డేట్తో క్లారిటీ ఇచ్చేసింది చిరు టీం.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ.. సినిమాపై క్యూరియాసిటీతోపాటు సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది.
Welcoming the acclaimed action choreographer @ActionAnlarasu for an Explosive High-Octane climax sequence, shooting in progress for the Mighty #Vishwambhara 💥💥
Mega Mass Action Loading 🎯
Experience the MEGA MASS BEYOND UNIVERSE in cinemas from January 10th, 2025 🌠
MEGASTAR… pic.twitter.com/v8ATSEu7s1
— UV Creations (@UV_Creations) August 4, 2024
Shivam Bhaje | గూస్బంప్స్ తెప్పించేలా శివం భజే.. డైరెక్టర్ అప్సర్పై నెటిజన్ల ప్రశంసలు
Veera Dheera Sooran | విక్రమ్, అరుణ్‌కుమార్ వీరధీరసూరన్ టీం విషెస్.. స్పెషల్ ఇదే..!
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం
విశ్వంభర కాన్సెప్ట్ వీడియో..