Veera Dheera Sooran | ఫిలిం ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (Filmfare Awards South 2024లో కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ పొన్నియన్ సెల్వన్ 2కుగాను ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. మరోవైపు చిత్త (చిన్నా) మూవీకిగాను ఎస్‌యూ అరుణ్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బాన్ని వీరధీరసూరన్ టీం ఘనంగా వేడుకగా జరుపుకుంటోంది.
విక్రమ్ ప్రస్తుతం చిన్నా ఫేం ఎస్‌యూ అరుణ్‌కుమార్ దర్శకత్వంలో వీరధీరసూరన్ (VeeraDheeraSooran) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబో అవార్డులను అందుకున్న సందర్బాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది చియాన్ విక్రమ్ టీం. విక్రమ్, ఎస్‌యూ అరుణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఛియాన్ 62గా వస్తోన్న ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. విక్రమ్ పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ మూవీతో సందడి చేయబోతున్నాడని టీజర్ చెప్పకనే చెబుతోంది.
Team #VeeraDheeraSooran celebrates as our hero @chiyaan & Our Director #SUArunKumar Filmfare awards for Best Actor & Best Director! Huge congrats on the well-deserved win for #PS2 and #Chithha, igniting joy on the sets! 🧨
Watch the special video by #VeeraDheeraSooran team for… pic.twitter.com/EFi1hSaUoV
— HR Pictures (@hr_pictures) August 4, 2024
Malavika Mohanan | బర్త్ డే స్పెషల్.. ప్రభాస్ రాజాసాబ్ సెట్స్‌లో మాళవిక మోహనన్
Prabhas | హను రాఘవపూడి-ప్రభాస్ ఫౌజీ పూజా సెర్మనీ ముహూర్తం ఫైనల్..!