ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు. వాటిలో చాలా వరకూ ఖరీదైనవి, రసాయనాలతో నిండినవే ఉంటాయి. అయితే, రూపాయి కూడా ఖర్చులేకుండానే ముఖ వర్ఛస్సును పెంచుకునే పద్ధతి గురించి బ్యుటీషియన్లు వివరిస్తున్నారు. ఫేస్ ట్యాపింగ్ ద్వారా అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని చెబుతున్నారు.
ఫేస్ ట్యాపింగ్ అంటే.. ముఖంపై సున్నితంగా మర్దనా చేసుకోవడం. ఈ పద్ధతి ద్వారా చర్మంలో రక్త ప్రసరణ, శోషరస ప్రసరణ మెరుగుపడుతుంది. ఫలితంగా, ముడతలు తగ్గడంతోపాటు చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. అంతేకాదు.. ఫేస్ ట్యాపింగ్‌తో కొల్లాజెన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. దాంతో చర్మం యవ్వనంగా మారుతుంది.
ఎన్నో ప్రయోజనాలు
ఇలా చేయాలి
ఫేస్ ట్యాపింగ్ కోసం ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖానికి ఏదైనా సీరమ్ అప్లయి చేయాలి. ఆ తర్వాత మధ్య, చూపుడు వేళ్లతో ముఖంపై సున్నితంగా మర్దనా చేయాలి. కళ్ల చుట్టూ, బుగ్గలపై, దవడ ఎముకల దగ్గర లయబద్ధంగా తడుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తుంటే.. అందంలో టాప్ ర్యాంక్ సొంతమవుతుంది.