Prabhas | అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీలోనే మంచి మార్కులు కొట్టేశాడు హను రాఘవపూడి (Hanu Raghavapudi). ఈ టాలెంటెడ్ డైరెక్టర్ 2022లో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సీతారామం సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. సీతారామం తర్వాత కొత్త సినిమా చేయబోతున్నాడని అంతా చర్చించుకుంటుండా.. ప్రభాస్ సినిమాను లైన్లో పెట్టినట్టు క్రేజీ వార్త తెరపైకి వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం పూజా కార్యక్రమం 2024 ఆగస్టు 17న హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ ఇన్సైడ్. ఈ సెర్మనీకి ప్రభాస్, హనురాఘవపూడితోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారట. `ఫౌజీ`(Fauji) టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతున్నట్టు టాక్. ఈ చిత్రంలో ప్రభాస్ ఒక సైనికుడి పాత్ర పోషిస్తున్నాడరని ఇప్పటికే నెట్టింట వార్త ఒకటి హల్ చల్ చేస్తోంది.
ఇండస్ట్రీ సర్కిల్ లో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం ఫౌజీ.. సీతారామం, రాధేశ్యామ్ లా వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. మరి బ్యాక్ టు బ్యాక్ సినిమాల మధ్యలో ఫౌజీ చిత్రానికి ఎప్పుడు టైం ఇస్తాడనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Kalki 2898 AD | గెట్ రెడీ.. ఇక రూ.100కే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చూసే అవకాశం
Buddy Review | అల్లు శిరీష్ కొత్త ప్రయత్నం వర్కవుట్ అయిందా.. బడ్డీ ఎలా ఉందంటే..?
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?