Buddy | టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ (Allu Sirish) నటించిన యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ బడ్డీ (Buddy). తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. బడ్డీ ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తుంది. అల్లు శిరీష్ కొత్త ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా..? మరి అల్లు శిరీష్-టెడ్డీబేర్ ప్రయాణం ఎలా సాగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
కథేంటి.. సినిమా ఎలా సాగుతుందంటే..?
అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ పాత్రలో ఎంట్రీ ఇస్తాడు అజ్మల్ అమీర్. ఇంప్రెసివ్‌గా సాగే ఓపెనింగ్ టైటిల్స్ అనంతరం హీరోయిన్ ప్రిషా సింగ్ పరిచయం ఉంటుంది. ఊహించని ట్విస్ట్ ఇస్తూ హీరోయిన్ జీవితంలోకి టెడ్డీబేర్ వస్తుంది. ఈ క్రమంలో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో సాగే సన్నివేశాలుంటాయి. టెడ్డీబేర్ అల్లు శిరీష్ దగ్గరకు రావడం.. అటు నుంచి ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఫైట్ సన్నివేశాలతో సాగుతుంది.
టెడ్డీబేర్ ఎలా జీవం పోసుకుందో తెలుసుకుంటాడు అల్లు శిరీష్. ఈ క్రమంలో వచ్చే సీన్లు సన్నివేశాలు టెడ్డీ లోపల ఉన్న వ్యక్తిపై ఫోకస్ పెట్టే సన్నివేశాలుంటాయి. అనంతరం అల్లు శిరీష్, టెడ్డీ బేర్‌తో కలిసి డాక్టర్ అజ్మర్ అమీర్ అక్రమ కార్యకలాపాలను పరిశోధించే నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయి. కొన్ని వినోదాత్మక అంశాలతో అల్లు శిరీష్, టెడ్డీ బేర్ మధ్య వచ్చే సన్నివేశాలు ఓ సారి చూడొచ్చంటున్నారు నెటిజన్లు.
సెకండాఫ్‌లో కథ హాంకాంగ్‌కు మారుతుంది. ఇంతలో డాక్టర్ అజ్మల్ అమీర్‌కు సంబంధించి ఇంటెన్స్ సీక్వెన్స్ ఉంటుంది. అల్లు శిరీష్ బడ్డీ కోసం హాంకాంగ్‌కు రాగా.. డాక్టర్ ఫాలోవర్లు అతన్ని వెంబడిస్తారు. ఈ క్రమంలో అలీ ఎంట్రీ ఇస్తాడు. ఇక అల్లు శిరీష్, బడ్డీ, అలీ మెయిన్ విలన్ ఎవరో కనుగొనే పనిలో ఉంటారు.
రౌడీ గ్యాంగ్ టెడ్డీని చంపేందుకు ప్రయత్నించడం.. టెడ్డీ మనుషుల్లా ప్రవర్తించడం.. రౌడీలు టెడ్డీని టార్గెట్ చేయడం.. అల్లు శిరీష్ టెడ్డీని కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే అంశాల నేపథ్యంలో సాగుతుంది. టెడ్డీ కామెడీ, డైలాగ్స్ కోసం చూడొచ్చని చెబుతున్నారు.
చాలా బాగుంది..!
ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమా పట్ల తన స్పందన తెలియజేశాడు. ప్రియమైన శిరీష్.. మీ అభిరుచికి అనుగుణంగా ఎంపిక చేసుకున్న బడ్డీ సినిమా ప్రతిదీ చాలా బాగుంది..! బడ్డీ ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. గుడ్ ఓపెనింగ్.. భారీ విజయం సాధించాలని ఆశిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సూర్య ట్వీట్ చేశాడు.
Dearest Sirish! Rooting for your passion project #Buddy everything looks great..! When you have your heart in it, it will surely be a unique film! Hearty wishes for a great start and a huge success brother! 👊🏽 @AlluSirish @Antonfilmmaker@hiphoptamizha @GnanavelrajaKe… pic.twitter.com/oI2EF9TqCV
— Suriya Sivakumar (@Suriya_offl) August 2, 2024
Trisha | ఓటీటీలో త్రిష తెలుగు వెబ్ సిరీస్ బృంద.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే..?
Aamir Khan | క్రేజీ టాక్.. ఆ డైరెక్టర్‌నే నమ్ముకున్న అమీర్‌ఖాన్..!
Satyabhama | మరో ఓటీటీ ప్లాట్‌ఫాంలో కాజల్ అగర్వాల్ సత్యభామ