ఖైరతాబాద్, జనవరి 4 : యూ ట్యూబర్ అన్వేష్ కేసును సైబర్ క్రైమ్‌కు బదిలీ చేసినట్టు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఆదివారం మరోసారి సినీ నటి కరాటే కల్యాణి యూట్యూబర్ అన్వేష్‌పై చర్యలు తీసుకోవాలని కో రారు. గత నెల 31న హిందూ దేవతలను దూషించినందుకు ఆమె ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తాజాగా, అన్వేష్‌పై అదనంగా సెక్షన్ 69ఏ బీఎన్ఎస్ కింద కేసు నమోదుచేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ యాక్ట్‌తో అతడి చానెల్‌ను బ్లాక్ చేయాలని ఫిర్యాదులో కోరారు.