హైదరాబాద్, జనవరి 4(నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ గ్రా మీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘నరేగా బచావో సంగ్రామ్’ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం ఏఐసీసీ ప్రత్యేక సమన్వయ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ కమిటీలో రాష్ట్ర మంత్రి ధనసరి సీతకకు చోటుకల్పించారు. అజయ్ మా కెన్ కన్వీనర్‌గా ఉన్న కమిటీలో.. జైరాంరమేశ్, సందీప్‌దీక్షిత్, ఉదిత్‌రాజ్, ప్రియాంక్ ఖర్గే, దీపికాపాండే, సునీల్ ప వార్, మానిశ్శర్మ సభ్యులుగా ఉన్నారు.